- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖపట్నం | భీమునిపట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. డిసెంబర్ 4న జరిగిన చిలకలూరిపేట రోడ్డు ప్రమాద ఘటనను మరువక ముందే మరో ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. డిసెంబర్ 4న జరిగిన చిలకలూరిపేట రోడ్డు ప్రమాద ఘటనను మరువక ముందే మరో ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. నగరంలోని భీమునిపట్నం బీచ్ వద్ద ఓ కారు డ్రైవర్ కారుతో బీభత్సం చేసిన ఘటన విశాఖపట్నంవాసులను భయాందోళనలకు గురి చేస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం విశాఖపట్నం భీమునిపట్నం వద్ద ఓ కారు డ్రైవర్ తన నిర్లక్ష్య డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారు. నిర్లక్ష్యంగా కారును నడుపుతూ బీచ్ సమీపంలో కారు డ్రైవింగ్ పై పట్టును కోల్పోయాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన కారు భీమునిపట్నం బీచ్ వద్ద డివైడరును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందు వెళ్తున్న మరో కారును, ఆటోను ఢీకొట్టింది. అదుపు తప్పిన కారు ఢీకొట్టడంతో మరో కారు ధ్వంసమైంది. ఆటో కూడా బాగా దెబ్బతింది. అయితే ఈ ఘోర ప్రమాద ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళకు గాయాలయ్యాయి. ఆ మహిళను వెంటనే చికిత్స నిమిత్తం ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి తరలించారు. అయితే సదరు కారు డ్రైవర్ లైసెన్స్ లేకుండానే కారు నడిపినట్లు సమాచారం. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






