- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: యూట్యూబర్ లోకల్‌బాయ్ నాని అరెస్ట్.. రిమాండ్
విశాఖ యూట్యూబర్ లోకల్‌బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha) యూట్యూబర్ లోకల్‌బాయ్ నాని(Localboy Nani)ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా(Social Media)లో బెట్టింగ్ యాప్‌లు(Betting Apps) ప్రమోట్ చేసిన ఫిర్యాదులపై కేసు నమోదు చేశారు. నానిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. దీంతో నానికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు నానిని పోలీసులు జైలుకు తరలించారు.
విశాఖకు చెందిన లోకల్ బాయ్ నాని ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లలో వీడియోలు పోస్టు చేస్తూ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే నానిపై ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐపీఎస్ సజ్జనార్ హెచ్చరించారు. దీంతో ఆయనకు నాని క్షమాపణ చెప్పారు.
కానీ సజ్జనార్ చేసిన ట్వీట్‌ని విశాఖ సీపీ సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే యాక్షన్‌కు దిగారు. ఇదే సమయంలో నానిపై పదుల సంఖ్యలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన పోలీసులు పలు సెక్షన్ల కింద నానిపై కేసు నమోదు చేశారు.






