Visakha: వినూత్న నిరసన.. విజయసాయిరెడ్డి పోస్టర్‌కి మద్యంతో అభిషేకం

by Vemula.Srinu Prasad |

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోస్టర్‌కి విశాఖ బీజేపీ నేతలు, కార్యకర్తలు మద్యంతో అభిషేకం చేశారు..

Visakha: వినూత్న నిరసన.. విజయసాయిరెడ్డి పోస్టర్‌కి మద్యంతో అభిషేకం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోస్టర్‌కి విశాఖ బీజేపీ నేతలు, కార్యకర్తలు మద్యంతో అభిషేకం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయరెడ్డి చేసి వ్యాఖ్యలపై విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా మోర్చా నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీ విజయసాయిరెడ్డి పోస్టర్‌కి మద్యంతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఆరోపణలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని సూచించారు. పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి దిగజారుడు మాట్లాడటం దగదని హెచ్చరించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మద్యంపై పురంధేశ్వరి ఆరోపణలు చేశారు. అందుకు దీటైన సమాధానం చెప్పాలి గాని బెదిరింపులకు పాల్పడటం మంచిది కాదు. మహిళల పట్ల గౌరవం ఉందంటూనే విజయసాయిరెడ్డి తప్పుడు మాటలు మాట్లాడటం దారుణం. పురంధేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. చేసిన తప్పునకు పాశ్చాత్తాపం ప్రకటించాలి.’అని జీవీఎల్ డిమాండ్ చేశారు.

Next Story