సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ

by Thanuru Gopichand |

విశాఖపట్నం సింహాచలంలో (Simhachalam) కొలువుదీరిన వరాహ లక్ష్మీనరసింహ స్వామికి ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దర్శించుకున్నారు.

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం సింహాచలంలో (Simhachalam) కొలువుదీరిన వరాహ లక్ష్మీనరసింహ స్వామికి ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కోహ్లీకి ఘన స్వాగతం పలికారు. దేవాలయాన్ని సందర్శింపజేశారు. స్వామివారిని దర్శింప చేయించి తీర్థప్రసాదాలను ఇవ్వగా వాటిని విరాట్ కోహ్లీ స్వీకరించారు. దర్శనానంతరం ఆలయ ఆవరణలోని మండపంలో కోహ్లీ ఆసీనులయ్యారు. ఈ క్రమంలో దేవాలయ అధికారులను కోహ్లీని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పరమ పవిత్రమైన స్వామి వారికి చిత్రపటాన్ని భారత్ క్రికెట్ ఆటగాడైన విరాట్ కోహ్లీకి అందజేశారు. స్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా ఎంతో పారవశ్యానికి లోనైనట్లు విరాట్ పేర్కొన్నారు. దర్శనం చేయించినందుకు, తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి పరమ పవిత్రమైన చిత్రపటాన్ని అందించినందుకు గానూ దేవాలయ అధికారులకు ధన్యవాదాలను తెలియజేశారు.

అయితే విశాఖపట్నం వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత టీం ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉంది. భారత జట్టుకు విశాఖపట్నం ప్రతిసారి కలిసొస్తోంది. రెండేళ్లకు పైగా వరుసగా 20 వన్డేల్లో కలిసిరాని టాస్ ఇక్కడ టీమిండియాను వరించిన విషయం తెలిసిందే. భారీ స్కోరు చేసేలా కనిపించిన ప్రత్యర్థి బాట్స్ మెన్లను బౌలర్లు కట్టడి చేశారు. బ్యాటింగ్ సెషన్ లో కూడా ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా రెచ్చిపోయారు. వన్డేల్లో తొలిసారి యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేయగా, వెటరన్ స్టార్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోరు కొనసాగించి సెంచరీలను కొట్టారు. ఇలా తిరుగులేని విజయంతో వన్డే సిరీస్ సొంతం చేసుకున్న తరువాత విరాట్ కోహ్లీ సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం పట్ల జిల్లా వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story