Special Train: విశాఖ వాసుల కోసం ప్రత్యేక రైలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-04-19 12:10:56  IST  )

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో వారణాసి ప్రత్యేక రైలును ప్రారంభించారు...

Special Train: విశాఖ వాసుల కోసం ప్రత్యేక రైలు
X

దిశ,డైనమిక్ బ్యూరో: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో వారణాసి ప్రత్యేక రైలును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, విశాఖపట్నం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ వారణాసి ప్రత్యేక రైలును సాధించారు. అత్యంత పవిత్రమైన గంగా నది పుష్కరాలు సమయంలో విశాఖపట్నం వాసులు పుష్కరాలకు తరలివెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైలును సాధించారు.

ఎంపీ జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ కేవలం పుష్కర సమయంలోనే కాకుండా వేసవి సెలవులు ముగిసే వరకు ఈ ప్రత్యేక రైలు నడపబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర, పార్టీ ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, గాజువాక కోఆర్డినేటర్ కేఎన్ఆర్, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీ యాదవ్ తదితరులు,పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story