మూడు కిలోమీటర్లు.. గర్భిణిని డోలీలో తీసుకెళ్లిన గిరిజనులు

by Thanuru Gopichand |   (  Updated:2025-10-31 10:40:47  IST  )

అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు.

మూడు కిలోమీటర్లు.. గర్భిణిని డోలీలో తీసుకెళ్లిన గిరిజనులు
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. మొంథా తుఫాను ప్రభావంతో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలోని మట్టి రోడ్డు కూడా అస్తవ్యస్తంగా మారింది. దారంతా రాళ్లు తేలి ప్రమాదకరంగా తయారైంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలంటే గిరిజనులు అష్టకష్టాలు పడక తప్పేలా లేదు. వివరాల్లోకి వెళ్తే అల్లూరి జిల్లాలోని జి.మాడుగుల మండలం కోట్ల గరువు గ్రామంలో రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది . గ్రామంలోని పార్వతమ్మ అనే గర్భిణి రెండు రోజులుగా పురిటి నొప్పులతో బాధపడుతోంది. మొంథా తుఫాను కారణంగా ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గర్భిణికి నొప్పులు ఎక్కువవడంతో బంధువులు ఆమెను డోలీలో తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గురువారం గర్భిణిని డోలీలో మోసుకుంటూ మూడు కిలో మీటర్ల వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాడేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తారు రోడ్డు సౌకర్యం ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదని స్థానిక గిరిజనులు అంటున్నారు.

Next Story