- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్, గాంధీ ఆశయాలను తుంగలోకి తొక్కిన జగన్
by Vemula.Srinu Prasad |
అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను వైయస్ జగన్మోహన్ రెడ్డి తుంగలోకి తొక్కారని విశాఖ తూర్పు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు...

X
దిశ, విశాఖపట్నం: అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను వైయస్ జగన్మోహన్ రెడ్డి తుంగలోకి తొక్కారని విశాఖ తూర్పు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. తూర్పు నియోజకవర్గం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నల్ల కండువాలను ధరించి, ‘చంద్రబాబుతో నేను’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. పార్టీ శ్రేణులతో కలిసి నిరసన నినాదాలు చేశారు. సీఎం జగన్ నిరంకుశ పాలన నిలిచిపోవాలని చంద్రబాబును ప్రజలు అధికారంలోకి రావాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి పోతన రెడ్డి, కాళ్ల శంకర్, ఆరేటి మహేష్, పెద్ద ఎత్తున మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






