ఆ బీచ్ లో తక్షణమే కాంక్రీట్ కట్టడాలు ఆపండి: హైకోర్టు ఆదేశం

by Disha Web Desk 18 |
ఆ బీచ్ లో తక్షణమే కాంక్రీట్ కట్టడాలు ఆపండి: హైకోర్టు ఆదేశం
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: భీమునిపట్నం బీచ్ లో కాంక్రీట్ కట్టడాల పై హైకోర్టు కన్నెర్ర చేసింది. విశాఖ భీమునిపట్నం టౌన్ సర్వే no:-1516,1517,1519& 1523 బీచ్ వద్ద CRZ నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు జరుగుతున్నాయని జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణ జరిపి విశాఖ భీమునిపట్నం సిఆర్ జెడ్ పరిధిలో కాంక్రీట్ నిర్మాణాలపై ఏపీ కీలక ఆదేశాలు జారీ చేసింది నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేసింది.నిర్మాణ స్థలంలో వినియోగిస్తున్న యంత్రాలు వెంటనే సీజ్ చేయాలని ఆదేశించింది, తీసుకున్న చర్యలపై రిపోర్ట్ ఫైల్ చేయాలని స్పష్టం చేసింది.నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫోటో గ్రాఫ్స్ పిటిషనర్ కోర్టుకు అందజేశారు. పరిశీలించిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.


Next Story

Most Viewed