- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెచ్చిపోయి మాట్లాడుతున్నారు: సాధు పరిషత్ తీవ్ర ఆగ్రహం
టీటీడీ మాజీ ఈవో వైవీ సుబ్బారెడ్డి క్షమాపణలు చెప్పాలని సాధు పరిషత్ డిమాండ్ చేసింది..

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ మాజీ ఈవో వైవీ సుబ్బారెడ్డి(Former TTD EO YV Subbareddy) క్షమాపణలు చెప్పాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. సాధువులపై భూమన కరుణా రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. భూమన చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ఎజెండా బయటపడిందన్నారు. హిందూ సంఘాలు మౌనంగా ఉన్నాయని, అందువల్లే సాధువులపై వైసీపీ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కుటుంబం లేదని, సమాజమే తమ కుటుంబమని శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. దేవుడు ఇచ్చిన సంపదన తమకు ఉందని, ప్రాణాలు పోయినా తిరుమల శ్రీవారి కోసం పోరాటం చేస్తామని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి వెల్లడించారు.






