- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో పరుగులు పెట్టనున్న రైల్వే ప్రాజెక్టులు.. జూన్ నుంచి ‘దక్షిణ కోస్తా’ కార్యకలాపాలు!
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేశాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేశాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లు విశాఖపట్నంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సుమారు రూ.లక్షా 20 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పురోగతి, నూతన రైల్వే జోన్ ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
జూన్ 1 నుంచి జోన్ కార్యకలాపాలు
విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ డెక్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ (ఎస్‌సీవోఆర్) కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ముందుగా పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలను 2026 జూన్ 1వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభించేలా తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
కొత్త లైన్లు, స్టేషన్ల ఆధునికీకరణపై చర్చ
రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, నూతన రైళ్ల మంజూరు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. అలాగే, నూతనంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా.. పొరుగున ఉన్న మరికొన్ని రైల్వే సెక్షన్లను ఇందులో విలీనం చేయాలని, అవసరమైన పాలనాపరమైన మార్పులు చేపట్టాలని చంద్రబాబు రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కీలక సమావేశంలో ప్రాజెక్టుల పురోగతిపై అధికారుల బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. ఈ భేటీలో దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్, తూర్పుకోస్తా రైల్వే జీఎం పక్వాల్, వాల్తేరు డీఆర్‌ఎం, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు వివిధ జోన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






