Purnananda Remand Report: ఏడాదిగా గొలుసులు కట్టి మరీ అత్యాచారం..

by Disha Web Desk 16 |
Purnananda Remand Report: ఏడాదిగా గొలుసులు కట్టి మరీ అత్యాచారం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తండ్రిస్థానంలో ఉంటూ కంటికి రెప్పలా కాపాడాల్సిన స్వామీజీ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. పగలంతా దైవ ప్రచారం రాత్రైతే కామవాంఛలతో రగిలిపోయిన స్వామి గుట్టును ఓ బాలిక రట్టు చేసిన సంగతి తెలిసిందే. బాలికపై అత్యాచారం కేసులో జ్ఞానానంద ఆశ్రమం నిర్వాహకుడు పూర్ణానంద స్వామి ఆశ్రమంలో ఉన్న బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఆశ్రమం నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం దిశా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూర్ణానంద స్వామి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పూర్ణానంద స్వామి అత్యాచారం కేసులో రిమాండ్ రిపోర్టులో కీలక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విస్తుపోయే నిజాలు

జ్ణానాంద ఆశ్రమం నిర్వాహకుడు పూర్ణానంద స్వామి అత్యాచారాలపై దిశ పోలీసులు రిమాండ్ రిపోర్టులోకీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో దిశ పోలీసులు పొందుపరిచిన వివరాల ప్రకారం ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే పూర్ణానంద స్వామి అర్ధరాత్రి మైనర్ బాలికలని నిద్ర లేపి తన గదికి తీసుకొని వెళ్ళి అత్యాచారానికి పాల్పడే వాడని దిశ డీఎస్పీ వివేకానంద వెల్లడించారు. ఇలా ఒకరు కాదు ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. స్వామీజీ ఏడాది కాలంగా అత్యాచారం చేయడంతో మరో మైనర్ బాలిక గర్భం దాల్చిందని తమ నివేదికలో తేలిందని తెలిపారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలికను ఆశ్రమం నుంచి తీసుకువెళ్లిపోయారని దాంతో ఆ విషయం వెలుగులోకి రాలేదని అన్నారు. అనంతరం కాకినాడకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసినట్లు ప్రాథమికంగా ఆధారాలు లభించినట్లు దిశ డీఎస్పీ వివేకానంద రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.

బాధితులకు మెడికల్ పరీక్షలు

పూర్ణానంద స్వామీజీ అర్థరాత్రి మైనర్ బాలికను తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడే వాడని పోలీసులు తెలిపారు. బాలిక సహకరించకపోతే గదిలో బాలికను ఇబ్బందులు పెట్టేవాడని రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. కాళ్లకు గోలుసులు కట్టి నిర్బంధించి కృరంగా ప్రవర్తించేవాడని బాధితురాలు వాపోయినట్లు వెల్లడించింది. మైనర్ బాలికలకు గర్భం రాకుండా ఉండేందుకు పూర్ణానంద స్వామీజీ జాగ్రత్త పడేవారని తెలుస్తోంది. బాధితులు గర్భం దాల్చే అవకాశం ఉన్న సమయాలలో టాబ్లెట్స్ ఇచ్చేవాడని తెలిపింది. ఈ క్రమంలో విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో పూర్ణానంద స్వామీజీకి పోటన్సి టెస్ట్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అటు విజయవాడలో మహిళా గైనకాలజిస్ట్ చేత బాధిత మైనర్ బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ టెస్ట్‌లు నిర్వహించిన తరువాత శాంపిల్స్‌ను ఎఫ్.ఎస్.ఎల్‌కి పంపించారు. ఎఫ్.ఎస్.ఎల్ ప్రాథమిక నివేదికలో కూడా అత్యాచారం జరిగినట్టు అధికారులు నిర్ధారించాడంతో స్వామిజీ పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే ప్రస్తుతం పూర్ణానంద స్వామీ విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. జూలై 5 వరకు విశాఖపట్నం ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed