రూ.9.8 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలకు అవకాశం : ఎంపీ శ్రీభరత్

by Thanuru Gopichand |

విశాఖపట్నం (Vishakapatnam) వేదికగా జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.9.8 లక్షల కోట్ల విలువైన భాగస్వామ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని

రూ.9.8 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలకు అవకాశం : ఎంపీ శ్రీభరత్
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం (Vishakapatnam) వేదికగా జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.9.8 లక్షల కోట్ల విలువైన భాగస్వామ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని ఎంపీ శ్రీభరత్ (Sri Bharat) అన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుపై (CII Summit) జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో ఐటీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విశాఖపట్నం సుందరీకరణ కోసం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా విలువైన విధంగానే ఖర్చు అయ్యేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. అవి షో కోసం కాదని తెలిపారు.

వైసీపీ (YCP) పై విమర్శలు చేస్తూ.. పెట్టుబడుల సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటే ఆ పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టబడులు తేవడం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. పరిశ్రమలకు భూములు కావాలంటే అడ్డుకుంటారు.. మెడికల్ కళాశాలలకు (Medical Colleges) పెట్టుబడులు వస్తుంటే ఆందోళనలు చేస్తారు.. ఇలాంటివి చేస్తే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందన్నారు. అభివృద్ధి అంటే విరగ్గొట్టడమని, అడ్డుకోవడమని వైసీపీ భావిస్తోందని అన్నారు.

Next Story