Mlc Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమైన స్ట్రైకింగ్ ఫోర్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-01 12:34:57  IST  )

ఈ నెల 13న విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు...

Mlc Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమైన స్ట్రైకింగ్ ఫోర్స్
X

దిశ, ఉత్తరాంధ్ర: ఈ నెల 13న విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 1082 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల కోసం మోహరించినట్టు పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ తెలియజేశారు. విశాఖ కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధులకు 840 మందిని వినియోగిస్తున్నామన్న ఆయన పోలింగ్ లొకేషన్లు 43 ప్రాంతాలు, 112 పోలింగ్ స్టేషన్లతో పాటు 15 రూట్ మొబైల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక దళాలు, జిల్లా స్ట్రైకింగ్ ఫోర్సును కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత స్ట్రాంగ్ రూమ్ వద్ద సెంట్రల్ పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కౌంటింగ్ డే రోజు అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాను మోహరించనున్నట్టు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసు బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వివరించారు.

Next Story