- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పన్నను దర్శించుకున్న ఐపీఎస్ అధికారి హరేంద్ర కుమార్
"సింహాచల పుణ్యక్షేత్రం అత్యంత శక్తి వంతమైనదని, స్వామి వారి దర్శనం తనకు ఎనలేని మానసిక ప్రశాంతతను ఇచ్చిందని" అధిాకారి అన్నారు.

దిశ, సింహాచలం : ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో వేంచేసి యున్న శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి హరేంద్ర కుమార్ నేడు దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా స్వామివారి సన్నిధికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న హరేంద్ర కుమార్ ను సింహాచల దేవస్థానం పర్యవేక్షణ అధికారి బి.సత్య శ్రీనివాస్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే 'శక్తి స్వరూపం'గా వెలుగొందే కప్ప స్తంభాన్ని హరేంద్ర కుమార్ భక్తిశ్రద్ధలతో ఆలింగనం చేసుకున్నారు. గర్భా లయంలో కొలువై ఉన్న వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో అర్చక స్వాములు, వేద పండితులు హరేంద్ర కుమార్ కి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందజేశారు. సింహగిరి అప్పన్న కృపాకటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ అధికారి సత్య శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదాలను వారికి అందజేసి గౌరవించారు. "సింహాచల పుణ్యక్షేత్రం అత్యంత శక్తి వంతమైనదని, స్వామి వారి దర్శనం తనకు ఎనలేని మానసిక ప్రశాంతతను ఇచ్చిందని" ఈ సందర్భంగా హరేంద్ర కుమార్ తన భక్తి భావాన్ని వ్యక్తపరిచారు.






