పాడేరు ఏజెన్సీలో కొనసాగుతున్న హైఅలర్ట్

by Thanuru Gopichand |

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ (Paderu Agency) ప్రాంతంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. పీఎల్జీఏ వారోత్సవాల (PLGA Celebrations) నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

పాడేరు ఏజెన్సీలో కొనసాగుతున్న హైఅలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ (Paderu Agency) ప్రాంతంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. పీఎల్జీఏ వారోత్సవాల (PLGA Celebrations) నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పాడేరులో అదనపు బలగాలను మోహరించారు. వాహనాలను తనిఖీలు చేస్తూ అనుమానాస్పదంగా అనిపించిన వారిని విచారిస్తున్నారు. అదే విధంగా ఏజెన్సీలో డ్రోన్లను ఉపయోగిస్తూ మరింత నిఘాను పెంచారు. గత నవంబరులో మావోయిస్టు ప్రధాన నేత హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులను అల్లూరి సీతారామ రాజు మన్యం జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతమంతా కూడా భయాందోళనల మధ్య ఉంది.

ప్రతి ఏడాది డిసెంబర్ 2 నుంచి నక్సల్స్ పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే ఇటీవల మావోయిస్టు నేత అనంత్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది. మావోయిస్టుల లొంగుబాటు, మరోవైపు అగ్రనేతల ఎన్ కౌంటర్ల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరగాల్సిన సంస్మరణ వారోత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో అనంత్ పేర్కొన్నారు. అయినప్పటికీ మరో మూడు రోజులు వ్యవధి ఉండడంతో పీఎల్జీఏ వారోత్సవాలు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల తరపు నుంచి వస్తు్న్న ప్రకటనలు కూడా వాతావరణం చల్లబడలేదనే సంకేతాన్ని ఇస్తుండడంతో పరిస్థితులు సున్నితంగా మారినట్లు తెలుస్తోంది.

Next Story