సీఎం సహాయనిధి పేదలకు వరం : హోం మంత్రి

by Thanuru Gopichand |

సీఎం సహాయనిధి పేదలకు ఓ వరం లాంటిదని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి అన్నారు

సీఎం సహాయనిధి పేదలకు వరం : హోం మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం సహాయనిధి పేదలకు ఓ వరం లాంటిదని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ శుక్రవారం నిర్వహించారు. నక్కపల్లిలోని హోం మంత్ర క్యాంపు కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులు కార్యక్రమానికి హాజరయ్యారు. వారికి హోం మంత్రి అనిత వంగలపూడి (Anitha Vangalapudi) 5లక్షల 33వేల రూపాయలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక అవసరాలకు సీఎం సహాయనిధి వరంలా మారిందన్నారు. చాలా మంది వైద్య ఖర్చులను భరించలేక అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారు సీఎంఆర్ఎఫ్ (CMRF) పథకం కింద దరఖాస్తు చేసుకుంటే వారికి ఆర్థిక సాయం మంజూరవుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏ కష్టం రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హోం మంత్రి కోరారు.

Next Story