Vishaka Steel Plantను కొనడానికి వచ్చేవారి అంతు చూస్తాం

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-12-19 15:22:56  IST  )

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కొనేందుకు వచ్చేవారి అంతు చూస్తామని విశాఖ ఉక్కు ఏఐటీయూసీ నేత కేఎస్‌ఎన్‌‌రావు హెచ్చరించారు. విశాఖలో జరుగుతున్న ఏఐటీయూసీ 42వ జాతీయ సదస్సులో భాగంగా ఆయన సోమవారం పబ్లిక్‌ సెక్టార్‌ పరిశ్రమల తీరుపై తన అభిప్రాయం వెల్లబుచ్చారు..

Vishaka Steel Plantను కొనడానికి వచ్చేవారి అంతు చూస్తాం
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కొనేందుకు వచ్చేవారి అంతు చూస్తామని విశాఖ ఉక్కు ఏఐటీయూసీ నేత కేఎస్‌ఎన్‌‌రావు హెచ్చరించారు. విశాఖలో జరుగుతున్న ఏఐటీయూసీ 42వ జాతీయ సదస్సులో భాగంగా ఆయన సోమవారం పబ్లిక్‌ సెక్టార్‌ పరిశ్రమల తీరుపై తన అభిప్రాయం వెల్లబుచ్చారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఇప్పటికే పలు విధాలుగా పోరాటాలు చేశామని, కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కార్మికులు ఇక్కడి నుంచే ఆక్సిజన్‌ సరఫరా చేశారని, అలాంటి స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడితే ఊరుకునది లేదని, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్మికులకు నూతన వేతన ఒప్పందాల్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Next Story