Ap News:పొత్తు గెలవాలి పాలన మారాలి అనే నినాదంతో..ప్రత్యేక మేనిఫెస్టో!

by Disha Web Desk 18 |
Ap News:పొత్తు గెలవాలి పాలన మారాలి అనే నినాదంతో..ప్రత్యేక మేనిఫెస్టో!
X

దిశ,ప్రతినిధి: పొత్తు గెలవాలి పాలన మారాలి అనే నినాదం తో రూపొందించిన ప్రత్యేక మేనిఫెస్టో విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీ భరత్ శుక్రవారం విడుదల చేశారు. టీడీపీ ,జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశం శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది.విశాఖ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భారత్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడిచింది అని అన్నారు. వైసీపీ పాలనలో రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కును కోల్పోయారని, చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమంగా జైల్లో పెట్టారని ఆరోపించారు.విశాఖ పార్లమెంట్ లో లోక్ సభ , ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థుల మంచి మెజారీటితో గెలుస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజలు తమ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించి రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. మూడు పార్టీలతో ఉమ్మడి సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి ఐదు అంశాలు పై చర్చించడం జరిగిందని చెప్పారు. జగన్ అన్యాయంగా, అక్రమంగా దోచుకున్న డబ్బు తో రానున్న ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తామే ఇస్తున్నామని జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ చేసిన 12 లక్షల కోట్ల అప్పులు చేసి 2 లక్షల కోట్లు మాత్రమే ప్రజలకు పంచారు అని తెలిపారు.

పేదవారికి అన్నం పెట్టిన అన్న క్యాంటీన్ ను జగన్ మూసేశారు.మధ్య నిషేధం అని చెప్పి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలి అని కోరారు. విశాఖను మత్తు పదార్థాల అడ్డాగా మార్చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తాం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర అన్నారు. జగన్ విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. మద్యం విక్రయాలు చూపించి జగన్ అప్పు తెచ్చారు అని అన్నారు.విశాఖ పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భారత్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పారు.పెన్షన్ విషయంలో వైసీపీ నాటకాలు ఆడుతుంది అని అన్నారు.కార్యక్రమంలో అభ్యర్దులు వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాస్, జనసేన నేత పసుపులేటి ఉషా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed