- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: కాంట్రాక్టు కార్మికుల సంచలన నిర్ణయం.. రెండు, మూడు రోజుల్లో కీలక ప్రకటన
by Vemula.Srinu Prasad |
విశాఖ స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు(Visakhapatnam Steel Plant Contract Workers) సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరవధిక సమ్మె(Indefinite strike) నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో సమ్మెను ఖరారు చేయనున్నారు. శనివారం 1630 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఆర్ఎల్‌సీ మీటింగ్‌లో గడువు కోరినప్పటికీ మళ్లీ కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అఖిలపక్ష కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల అనంతరం సమ్మె తేదీ ప్రకటించే చాన్స్ ఉందని కాంట్రాక్టు కార్మికులు తెలిపారు. తమకు సమ్మెకు అఖిలపక్ష కార్మిక సంఘాలు సైతం మద్దతు తెలపనున్నాయని చెప్పారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగిరావాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story






