సొంత నేతలే కుట్ర చేస్తున్నారు: కంటతడి పెట్టుకున్న విశాఖ మేయర్‌

by Vemula.Srinu Prasad |

తన సామాజిక వర్గం నేతలే కుట్ర చేస్తున్నారని విశాఖ మేయర్‌ హరి వెంకటకుమారి కంటతడి పెట్టుకున్నారు..

సొంత నేతలే కుట్ర చేస్తున్నారు: కంటతడి పెట్టుకున్న విశాఖ మేయర్‌
X

దిశ, వెబ్ డెస్క్: తన సామాజిక వర్గం నేతలే కుట్ర చేస్తున్నారని విశాఖ మేయర్‌ హరి వెంకటకుమారి(Visakhapatnam Mayor Hari Venkatakumari) కంటతడి పెట్టుకున్నారు. తనపై అవిశ్వాసం పెట్టడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ(Ycp) గుర్తుపై గెలిచి అవిశ్వాసానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదన్నారు. తనను దించాలని కంకణం కట్టుకున్నారని మేయర్‌ కుమారి వాపోయారు. తమ అధినేత వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి(Ys Jagan Mohan Reddy) యాదవ సామాజిక వర్గంపై మమకారంతో మేయర్‌గా తనకు అవకాశం కల్పించారని చెప్పారు. తమ పార్టీ సిద్ధాంతం ప్రకారం కులమతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు. సంఖ్యాబలం లేకుండా తమపై అవిశ్వాసం పెట్టడం, కుట్రలు చేయడం ఎంతవరకూ సమంజసమో కూటమి నేతలు ఆలోచించాలని విశాఖపట్నం మేయర్ హరి వెంకటకుమారి వ్యాఖ్యానించారు.

కాగా విశాఖ కార్పొరేషన్‌పై కన్నేసిన కూటమి.. మేయర్ హరి వెంకట కుమారిపై కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. దీంతో ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం కార్యక్రమం జరగనుంది. గత ఎన్నికల్లో 58 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు. ప్రస్తుతం పలువురు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. దీంతో వారందరికి విప్ జారీ చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని చెప్పారు. కేవలం 11 నెలల సమయమే ఉన్న మేయర్ పదవి కోసం కూటమి అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ మరోసారి పునరాలోచించాలని సూచించారు. సొంత యాదవ కుటానికి చెందిన తన కంట్లో కన్నీరు చూడాలని మరో టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి వంశీ కృష్ణ శ్రీనివాస్ ఇన్ని కుట్రలు చేస్తున్నారని మేయర్ హరి వెంటక కుమారి ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story