- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖకు గుడ్ న్యూస్.. భారీగా పెట్టుబడులు
విశాఖ త్వరలోనే ఐటీ, పారిశ్రామిక హబ్‌గా రూపాంతరం చెందబోతోంది. దీంతో నగరానికి మరిన్ని అంతర్జాతీయ సంస్థలు రాబోతున్నాయని విశాఖ ఎంపీ భరత్ కీలక ప్రకటన చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha) త్వరలోనే ఐటీ, పారిశ్రామిక హబ్‌గా రూపాంతరం చెందబోతోంది. దీంతో నగరానికి మరిన్ని అంతర్జాతీయ సంస్థలు రాబోతున్నాయని విశాఖ ఎంపీ భరత్(Mp Bharat) కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే గూగుల్(Google) వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ అడుగుపెట్టగా, వాటి సమీపంలోనే తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు మరికొన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని, ఇందుకు అవసరమైన స్థలాల కోసం అన్వేషణ మొదలుపెట్టాయని ఆయన వెల్లడించారు.
బలమైన పునాది
నగరంలో ఏర్పాటు చేసిన డేటా సెంటర్(Date Center) కేవలం ఆరంభం మాత్రమేనని, ఇది విశాఖ అభివృద్ధికి ఒక బలమైన పునాదిగా నిలిచిందని ఎంపీ పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ రాకతో ప్రపంచ స్థాయి కంపెనీల దృష్టి విశాఖపై పడిందని, అందుకే ఇప్పుడు వరుసగా కొత్త సంస్థలు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం నగర భవిష్యత్తును మార్చబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మారిపోనున్న విశాఖ రూపురేఖలు
త్వరలోనే మరిన్ని కంపెనీల రాకతో విశాఖ రూపురేఖలు మారిపోనున్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తూ, విశాఖను గ్లోబల్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు.






