Breaking: 10 జిల్లాలతో విశాఖ, 9 డిస్ట్రిక్ట్‌లతో అమరావతి ఎకనమిక్ రీజియన్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-14 08:36:46  IST  )

ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. విశాఖతో పాటు అమరావతి, రాయలసీమను ఎకనమిక్ రీజియన్ల పరిధిలోకి తీసుకొచ్చారు....

Breaking: 10 జిల్లాలతో విశాఖ, 9 డిస్ట్రిక్ట్‌లతో అమరావతి ఎకనమిక్ రీజియన్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్‌(Ap Budget-2026-27)ను అసెంబ్లీ(Assembly)లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minsiter Payyavula keshav) ప్రవేశ పెట్టారు. మొత్తం 3,32,205 కోట్లతో బడ్జె‌ట్‌ను రూపకల్పన చేశారు. విశాఖ(Visakha)తో పాటు అమరావతి(Amaravati), రాయలసీమ(Rayalaseema)ను ఎకనమిక్ రీజియన్ల పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు కేటాయింపులు చేశారు. 10 జిల్లాలతో ఎకనమిక్ రీజియన్ పరిధిలోకి విశాఖను, 9 జిల్లాలతో అమరావతి ఎకనమిక్ రీజియన్‌(Amaravati Economic Region)గా ప్రకటించారు. విశాఖ ఎకనమిక్ రీజియన్(Visakhapatnam Economic Region)కు రూ.28 వేల కోట్లు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్(Rayalaseema Global Horticulture) హబ్‌కు రూ.30 వేల కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయింపు చేశారు. వివిధ రకాల నిధులతో అమరావతి పనులు వేగంగా జరుగున్నాయని పయ్యావుల తెలిపారు. ఇప్పటి వరకూ రూ. 57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపలనా అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత హోదా కల్పించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని పయ్యావుల పేర్కొన్నారు.

ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. గుడబెళ్లూరు-మహబూబ్‌నగర్ 4 లేన్ హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్లు మంజూరు

Next Story