నోరు అదుపులో పెట్టుకోండి: వైసీపీ నేతలపై ఎంపీ భరత్ సీరియస్

by Vemula.Srinu Prasad |

విశాఖ అభివృద్ధిపై వైసీపీ నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోవాలని ఎంపీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...

నోరు అదుపులో పెట్టుకోండి: వైసీపీ నేతలపై ఎంపీ భరత్ సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ అభివృద్ధిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, నోళ్లు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ ఎంపీ భరత్(Tdp Mp Bharat) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీసీఎస్‌(Tcs)కు నామమాత్రపు ధరకు భూములు ఇవ్వడంపై వైసీపీ నేతలు చేసిన విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ(Visakha) అభివృద్ధి చెందడం, యువతకు జాబ్స్ రావడం వైఎస్సార్ కాంగ్రెస్(Ysrcongress) పార్టీ నాయకులకు ఇష్టం లేదని మండిపడ్డారు. టీసీఎస్‌కు భూములు ఇవ్వడం వల్లేనే విశాఖకు వచ్చిందని, లేకపోతే వేరే చోటకు పోయేదని తెలిపారు. టీసీఎస్ వస్తే మరికొన్ని కంపెనీలు కూడా విశాఖ వస్తాయని చెప్పారు. వైసీపీ నేతలు ఇలానే దుష్ప్రచారం చేస్తే ఈసారి డిపాజిట్లు కూడా రావని ఎంపీ భరత్ విమర్శించారు.

Next Story