- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
G. V. Anjaneyulu: జగన్ డిమాండ్‌పై వినుకొండ ఎమ్మెల్యే స్ట్రాంగ్ రియాక్షన్
by Vemula.Srinu Prasad |
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ వచ్చి జగన్ శవరాజకీయాలు చేశారని మండిపడ్డారు. రషీద్, జిలానీ ఇద్దరినీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పెంచి పోషించారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్ ఎప్పుడూ ఢిల్లీలో ధర్నా చేయలేదన్నారు. ఇప్పుడు హస్తినలో రాష్ట్ర పరువు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జీవీ ఆంజనేయులు మండిపడ్డారు.
Next Story






