- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహితకు యువకుడి వేధింపులు: స్పాట్ ట్రీట్‌మెంట్ ఇచ్చిన స్థానికులు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం గడేకల్ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ప్రేమ పేరుతో వివాహితను వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు..

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapuram District) ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం గడేకల్ గ్రామం(Gadekal village)లో తీవ్ర కలకలం రేగింది. ప్రేమ పేరుతో వివాహిత(Married Woman)ను వేధింపులకు గురిచేస్తున్న యువకుడి(Young Man)ని స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అందరి ముందూ గుండు కొట్టించి, అవమానకర రీతిలో డప్పు చప్పుళ్లతో గ్రామంలో ఊరేగించారు.
రంగంలోకి పోలీసులు.. రెండు ఘటనపై విచారణ
అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మహిళను వేధించిన ఉదంతంతో పాటు, యువకుడిపై దాడి చేసి, గుండుకొట్టి ఊరేగించిన అంశాలపై కూడా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అయితే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆగ్రహంతో స్థానికులంతా ఒక్కటై యువకుడికి బుద్ధి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమ గ్రామంలో ఇంకెవరైనా ఇలాంటి వేధింపులకు పాల్పడిదే ఇదే శిక్ష విధిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.






