- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్.. ఈ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే
విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఒకవైపు రోడ్డు వాహన రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలంలోని కాజా నుంచి పెదఅవుటపల్లి వరకూ ఒకవైపు రోడ్డును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఒకవైపు రోడ్డు వాహన రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలంలోని కాజా నుంచి పెదఅవుటపల్లి వరకూ ఒకవైపు రోడ్డును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం మొదట అధికారుల వాహనాలను అనుమతించారు. ఆ తర్వాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై అన్నిరకాల వెహికల్స్ ను అనుమతిస్తున్నారు.
బైపాస్ నేషనల్ హైవే-16 (చెన్నై-కోల్ కతా)ని నేషనల్ హైవే - 65 (విజయవాడ - హైదరాబాద్)తో అనుసంధానించే ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది. ఈ రోడ్డు అందుబాటులోకి రావడంతో విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వకుండానే.. గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ గా రాజధాని అమరావతి లేదా హైదరాబాద్, ఏలూరు వైపుగా వెళ్లొచచు. మార్చినాటికి రెండోవైపు రోడ్డును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు. 48 కిలోమీటర్ల పొడవున ఆరులేన్లతో ఈ రహదారి నిర్మితమవుతోంది. దీంతో విజయవాడ గర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.






