- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రాజెక్టును అటకెక్కించింది జగన్ ప్రభుత్వమే: ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని అటకెక్కించింది జగన్ ప్రభుత్వమేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు...

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Rayalaseema Lift Irrigation Project)ని అటకెక్కించింది జగన్(Jagan) ప్రభుత్వమేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(Vijayawada MP Keshineni Shivnath) ఆరోపించారు. రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోవడానికి తెలుగుదేశం పార్టీనే కారణమని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన హయంలో జగన్ ఎన్విరాన్మెంటల్ పరిష్మన్ తీసుకోకుండా రూ.925 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు తన అనుచరులకు కాంట్రాక్ట్ కట్టబెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. హైకోర్టులో పిల్ కూడా జగన్ తన స్నేహితులు, తమ్ముళ్ల ద్వారా వేయించి స్టే తెచ్చి ఆపించి....ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు ఆపారని గగ్గోలు పెట్టడానికి సిగ్గుందా లేదా అంటూ కేశినేని శివనాథ్ నిలదీశారు.
జగన్ మాటలు నమ్మరు..
సీమ ప్రాజెక్టులపై జగన్ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బాధపడుతూ ఏండాలనేదే సైకో జగన్ ఆకాంక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో నోటి వెంట నిజం మాట్లాడలేని నేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ అని చెప్పారు. జగన్ ఒక చరిత్ర హీనుడని.. చరిత్ర సృష్టించే నాయకుడు సీఎం చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. సమగ్రాభివృద్ధి వైపు రాష్ట్రం పయనం చేస్తోందని, మూడు మహా నగరాలు కట్టిన చరిత్ర చంద్రబాబు సొంతం అని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించటం చాలా గొప్ప విషయం అని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.






