- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు.. కేక్ కటింగ్స్ పూర్తిగా నిషేధం
కొత్త సంవత్సర వేడుకలకు విజయవాడ సిద్ధమవుతోంది..

దిశ, వెబ్ డెస్క్: కొత్త సంవత్సర వేడుకలకు(New Year Celebrations) విజయవాడ(Vijayawada) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భద్రతపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నగరంలో కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి ఈ నెల 31 రాత్రి వేడుకల సందర్భంగా నగరంలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌తో సహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 13 వరకు ఈ నిబంధన రాత్రి వేళల్లో అమలులో ఉంటుందని వెల్లడించారు. నూతన సంవత్సర సంబరాల పేరుతో రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావుడి చేయడం వంటివి పూర్తిగా నిషేధించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు(Vijayawada Police Commissioner Rajasekhar Babu) తెలిపారు. యువత అతివేగంగా వాహనాలు నడపడం, బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు తీసి శబ్ధ కాలుష్యం సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి, కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో తమ ఇళ్ల వద్దే జరుపుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు.






