విజయవాడ - బెంగళూరు విమానానికి తప్పిన ముప్పు..

by Thanuru Gopichand |

విజయవాడ బెంగళూరు ఎయిరిండియా విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది.

విజయవాడ - బెంగళూరు విమానానికి తప్పిన ముప్పు..
X

టేక్‌ ఆఫ్‌ సమయంలో పక్షిని ఢీకొన్న విమానం

దిశ, డైనమిక్​ బ్యూరో : విజయవాడ బెంగళూరు ఎయిరిండియా విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. విజయవాడలో టేకాఫ్​అవుతుండగా విమాన రెక్కలను పక్షి ఢీకొంది. దీంతో అప్రమత్తమైన పైలట్​సురక్షితంగా విమానాన్ని రన్​వే మీదకు దించాడు. ప్రయాణికులందరినీ విమానం నుంచి దింపి లాంజ్​లోకి సిబ్బంది తరలించారు. విమాన పరిస్థితిని పరిశీలించాక మళ్లీ ప్రయాణంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఉదయం 8.25 గంటలకు ఎయిరిండియా విమాని బయలు దేరాల్సి ఉంది. విమాన రెక్కలు దెబ్బతిన్నట్లు సమాచారం. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story