హిందూ దేవాలయాలపై విజయసాయిరెడ్డి ట్వీట్.. వైరల్

by Vemula.Srinu Prasad |

హిందూ దేవాలయాలపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు..

హిందూ దేవాలయాలపై విజయసాయిరెడ్డి ట్వీట్.. వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: హిందూ దేవాలయాల(Hindu Temples)కు స్వయం ప్రతిపత్తి కల్పించాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former MP Vijayasai Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఆర్టికల్14కు వ్యతిరేకమని ఆయన తెలిపారు. హిందూ ఆలయాలకు మాత్రమే స్వయం ప్రతిపత్తిలేదని గుర్తు చేశారు. ఇతర మతాల ఆలయాలు స్వయం ప్రతిపత్తిలో కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్క మతానికి సమానత్వం కల్పించాలన్నారు. మతాల మధ్య రాజ్యాంగ బద్ధంగా సమానత్వం ఉండాలని ఆకాక్షించారు. హిందూ ఆచారాలను కాపాడాలని, ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. హిందూ ఆలయాలపై ప్రస్తుత విధానాలను కేంద్రం పున:పరిశీలించాలని కోరారు. ఈ విషయంపై వెంటనే హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని ట్వీట్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Next Story