- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు.. విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. హిందువులను మతమార్పిడి చేస్తున్నారు అంటూ ఓ యూట్యూబర్ చేసిన వీడియోను విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో షేర్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. హిందువులను మతమార్పిడి చేస్తున్నారు అంటూ ఓ యూట్యూబర్ చేసిన వీడియోను విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే కాకుండా హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. డబ్బు ఆశచూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటివారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు.
దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. అదే భారతదేశానికి రక్ష.. శ్రీరామ రక్ష అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతంలో విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నారు. ఆయన జగన్ హయాంలో ఆయన ఎంపీగా పనిచేశారు. గత పదేళ్లలో అంటే మాజీ సీఎం జగన్ ప్రభుత్వం కూడా అవుతుంది. దీంతో విజయసాయి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో ఎన్నడూ ఆయన మతాల గురించి మాట్లాడకపోవడం, ఇప్పుడు మత మార్పిడి గురించి మాట్లాడటంతో ఆయన బీజేపీలోకి వెళుతున్నారా అనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. విజయసాయి బీజేపీలో చేరుతున్నారు అంటూ గతంలో వార్తలు రాగా ఆయన ఖండించిన సంగతి తెలిసిందే.






