- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దైవం మానుష రూపేణ’కు నిలువెత్తు రూపం విజయ్ దేవరకొండ: ఎంపీ రామ్మోహన్ నాయుడు
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండపై శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండపై శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. కష్టాల్లో ఉన్న ఎందరికో విజయ్ దేవరకొండ కొండంత అండగా నిలుస్తున్నారని కొనియాడారు. 'దైవం మానుష రూపేణ'అనే వ్యాఖ్యానికి అర్థంగా నిలుస్తూ విజయ్ దేవరకొండ ఎందరోపాలిట దేవుడిగా మారారని అభివర్ణించారు. సినీనటుడు విజయ్ దేవరకొండ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. తాజాగా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన ఒక పాప ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. తన అభిమాన సంఘాల ద్వారా ప్రమాద విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ... ఆ చిన్నారికి లక్ష రూపాయల చెక్ పంపించారు. అయితే ఈ చెక్‌ను ఆ చిన్నారికి శుక్రవారం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అందజేశారు. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ సేవలను కొనియాడారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో విజయ్ దేవరకొండ ముందు ఉంటారని ప్రశంసించారు. ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న చిన్నారికి ఆపన్నహస్తం అందించిన విజయ్ దేవరకొండకు తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.






