Andhra University: ఏయూ మాజీ వీసీపై అక్రమాలపై విజిలెన్స్ విచారణ

by Thanuru Gopichand |

ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తిచేసి, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

Andhra University: ఏయూ మాజీ వీసీపై అక్రమాలపై విజిలెన్స్ విచారణ
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: ఆంధ్ర యూనివర్సిటీలో(AU) మాజీ వీసీ ప్రసాదరెడ్డి (Prasadreddy) హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తిచేసి, కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara LOkesh) చెప్పారు.ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవినీతి, అక్రమాలపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలపై లోకేష్ సమాధానమిస్తూ.. రూ.20 కోట్ల రూసా గ్రాంట్ దుర్వినియోగం అయిందన్నారు. ఇస్రో నుంచి వచ్చిన రూ.25లక్షలను ఖర్చు విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అందిందన్నారు. అవినీతి, అధికార దుర్వినియోగం, విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించారని తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. విజిలెన్స్ (Visilence Report)​రిపోర్టు వచ్చిన వెంటనే వర్సిటీలో అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు. ఎవరినీ ఉపేక్షించేది లేదు, మరోసారి పొరపాటు చేయాలంటే భయపడేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలను పెంచి, గతవైభవం తెస్తామని ప్రకటించారు.

Next Story