నాపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను వదిలిపెట్టను.. విడదల రజిని వార్నింగ్

by Ajay Maddhiboyina |

త‌నపై, త‌న కుటుంబంపై, అనుచరులపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను వదిలిపెట్టను అంటూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి విడదల రజిని వార్నింగ్ ఇచ్చారు. ప‌ల్నాడు జిల్లా ఎస్పీని కలిసి త‌న అనుచ‌రుల‌పై త‌ప్పుడు కేసుల‌ను పెట్టార‌ని, వెంట‌నే తొల‌గించాల‌ని విన‌తీప‌త్రం అంద‌జేశారు

నాపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను వదిలిపెట్టను.. విడదల రజిని వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌నపై, త‌న కుటుంబంపై, అనుచరులపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను వదిలిపెట్టను అంటూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి విడదల రజిని వార్నింగ్ ఇచ్చారు. ప‌ల్నాడు జిల్లా ఎస్పీని కలిసి త‌న అనుచ‌రుల‌పై త‌ప్పుడు కేసుల‌ను పెట్టార‌ని, వెంట‌నే తొల‌గించాల‌ని విన‌తీప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. కొంద‌రు టీడీపీ నాయ‌కులు గాలి పోగేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని చెప్పారు. టీడీపీ నాయ‌కుల మెప్పు కోసం త‌ప్పుడు ఫిర్యాదులు చేస్తున్నార‌ని ఆరోపించారు.

కంప్లైంట్ చూస్తే అందులో పోలీసుల పాత్ర కూడా ఉంద‌ని త‌నకు అనుమానం ఉంద‌న్నారు. శ్రీ గ‌ణేష్ చౌద‌రి 2024 ఎన్నిక‌ల్లో ద‌ర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి క్యాంపెయిన్ లో ఉన్నార‌ని చెప్పారు. ఎంతో స‌న్నిహితంగా ఉంటూ ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నార‌ని తెలిపారు. ఆయ‌న టీడీపీ వ్య‌క్తి అని, క‌ట్టు క‌థ అల్లి త‌న‌పై కేసు పెట్టార‌ని చెప్పారు. త‌న‌ను టార్గెట్ చేసి ఆడ మ‌నిషి రాజకీయాల‌ను త‌ట్టుకోలేక త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని అన్నారు. బెదిరింపుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌ర‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే త‌న‌పై ఏడు త‌ప్పుడు కేసులు పెట్టార‌ని అన్నారు.

Next Story