- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన నాయకుల వల్లే పవన్‌కు అనారోగ్యం: బాధితురాలు హర్ష వీణ
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో బాధితురాలినని పేర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగిని, బాధితురాలు హర్షవీణ మరో వీడియోను విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు....

దిశ, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Janasena Mla Arava Sridhar) చేతిలో బాధితురాలినని పేర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగిని, బాధితురాలు హర్షవీణ మరో వీడియోను విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒక వ్యక్తి తనను నడిరోడ్డుపై కొట్టాడని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ఈసారి ఎవరైనా దాడికి వస్తే నోటితో కాకుండా చేతితోనే సమాధానం చెబుతానని హెచ్చరించారు. ఒక్క దెబ్బ ఎదుటివారిపై పడితే వారి పరువే కాకుండా పార్టీ గౌరవం కూడా గంగలో కలుస్తుందని హర్ష వీణ ఘాటుగా స్పష్టం చేశారు.
అందువల్లే పవన్‌కు అనారోగ్యం...
పార్టీలో కొందరు నాయకుల ప్రవర్తన వల్లే పవన్ కల్యాణ్(Pawan Kalyan) అనారోగ్యం పాలవుతున్నారని హర్షవీణ ఆరోపించారు. ప్రధానంగా అరెవ శ్రీధర్ అనే వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ.. ఆయన గతాన్ని తవ్వాలంటే ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం(East Godavari Yeleswaram) నుంచి విజయవాడ నోవోటల్ హోటల్(Novotel Hotel Vijayawada) వరకు ఎన్నో విషయాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. పార్టీ ఎటువంటి క్లీన్ చీట్ ఇవ్వకపోయినా, ఆయనను ఇంకా పార్టీ కండువా కప్పుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు...
అరెవ శ్రీధర్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని, పవన్ కల్యాణ్ మాటలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని హర్షవీణ విమర్శించారు. ఒక పక్క వివాదాల్లో ఉన్నప్పటికీ, పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






