కీలక పరిణామం.. పవన్ కల్యాణ్‌తో VHPనేతల భేటీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-01 15:50:31  IST  )

రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది....

కీలక పరిణామం.. పవన్ కల్యాణ్‌తో VHPనేతల భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)తో VHP నేతలు భేటీ అయ్యారు. మంగళగిరి(Mangalagiri)లో ఆయన్ను విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రెటరీ జనరల్ మిలింద్ పరాందే సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం, సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఈ ఏడాది జనవరిలో విజయవాడ(Vijayawada) వేదికగా నిర్వహించిన హైందవ శంఖారావం డిక్లరేషన్‌పై వివరించారు. ఈ సమావేశంలో వి.హెచ్.పి. అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఏపీ, తెలంగాణ క్షేత్ర కార్యదర్శి టి.సత్య రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఒబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి వి.దుర్గా ప్రసాదరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేసింది... ట్వీట్‌పై క్లిక్ చేయగలరు..

Next Story