- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల VIP దర్శనాలపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
తిరుమలలో VIP దర్శనాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) సంచలన వ్యాఖ్యలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో VIP దర్శనాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) సంచలన వ్యాఖ్యలు చేసారు. నేడు తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు. అయితే వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని సూచన చేసారు. తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి సామాన్య భక్తులు వస్తారని, వీఐపీ దర్శనాల పేరుతో వారి క్యూ లైన్స్ ఆపివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. ఎలాగో సౌలభ్యం ఉంది కదా అని ప్రతినెలా వచ్చి ఇబ్బందులు సృష్టించే కంటే ఏడాదిలో ఒక్కసారి వచ్చినా శ్రీవారి కరుణాకటాక్షాలు అలాగే ఉంటాయని అన్నారు. తిరుమలకు వచ్చే ప్రజాప్రతినిధులు, సెలెబ్రేటిస్ హుందాగా వ్యవహరించాలని వెంకయ్యనాయుడు కోరారు.






