గొప్పవాళ్ళంతా తెలుగులోనే చదువుకున్నారు : వెంకయ్య నాయుడు

by Muthe.Rajitha |

పిల్లలకు తెలుగు నేర్పాల్సిన అవసరం లేదని కొంతమంది తల్లిదండ్రులు భావించడం బాధాకరం

గొప్పవాళ్ళంతా తెలుగులోనే చదువుకున్నారు : వెంకయ్య నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : రామాయణ కాలంలో కూడా తెలుగు భాష ఉందని సూచించే కొన్ని ఆధారాలు ఇటీవల బయటపడ్డాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. గుంటూరులో జరిగిన మూడో తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గొప్ప స్థాయికి చేరుకున్నవారంతా తమ మాతృభాషలోనే చదువుకున్నారని అన్నారు. తెలుగు భాషను నిలబెట్టేందుకు ఎంతో మంది మహనీయులు కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగువారై ఉండి తెలుగు మాట్లాడకపోతే లోపం ఉన్నట్లేనని, అమ్మ అనే పదం హృదయం నుంచి వస్తే మమ్మీ అనేది నోటి వరకే పరిమితమని వ్యాఖ్యానించారు.

ఈ రోజుల్లో పిల్లలకు తెలుగు నేర్పాల్సిన అవసరం లేదని కొంతమంది తల్లిదండ్రులు భావించడం బాధాకరమన్నారు. మాతృభాషను మరిచిపోతే శ్వాస కోల్పోయినట్టేనని, తెలుగు భాషను కాపాడాలంటే తెలుగులో మాట్లాడటం చాలని చెప్పారు. తెలుగు భాష కోసం కవులు, రచయితలు, కళాకారులు చేసిన త్యాగాన్ని గుర్తించాలన్నారు. మన దేశంలో మాతృభాషలో సాంకేతిక కోర్సులు తీసుకురావాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Next Story