- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: జమిలి ఎన్నికలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
జమిలి ఎన్నికలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: జమిలి ఎన్నికల(Jamili Election)పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Former Vice President Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం-ఒక ఎన్నిక(One Nation-One Election)పై తిరుపతి(Tirupati)లో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ టెక్నాలజీ సాయంతో జమిలి ఎన్నికలు నిర్వహించడం పెద్ద కష్టం కాదన్నారు. చాలా సులువుగా ప్రక్రియను పూర్తి చేయొచ్చని చెప్పారు. రాజకీయ కోణంలో జమిలిని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఖర్చు సేవ్ అవుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోవడాన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, పార్టీ ఫిరాయింపులు మంచిదికాదన్నారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల పోటీ చేయకుండా చేయాలని, అలా చట్టంలో మార్పులు తీసుకురావాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.






