- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 28 నుంచి వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ : CISF DIG రాఘవేంద్ర
వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని తీరప్రాంతాల్లో వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ నిర్వహించాలని సీఐఎస్ఎఫ్ నిర్ణయించింది.

దిశ, వెబ్‌డెస్క్: వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని తీరప్రాంతాల్లో వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ నిర్వహించాలని సీఐఎస్ఎఫ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ఈనెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 22 వరకూ 25 రోజులపాటు విశాఖలో కోస్టల్ సైక్లోథాన్ నిర్వహించనున్నట్లు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.జి. రాఘవేంద్రకుమార్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ స్మారక కార్యక్రమంలో భాగంగా.. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ సైక్లింగ్ ర్యాలీని కేంద్రమంత్రి.. మేజర్ ధియాన్ చంద్ నేషనల్ స్టేడియంలో వర్చువల్ గా ప్రారంభిస్తారు. 6,553 కిలోమీటర్ల తీరప్రాంతం వెంబడి రెండు సైక్లింగ్ టీమ్స్.. డ్రగ్స్, ఆయుధాల సరఫరా, మానవ అక్రమ రవాణా వంటి నేరాలపై అవగాహన కల్పించనున్నాయి.






