- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Lokesh: వనజీవి రామయ్య మరణం బాధాకరం
ప్రఖ్యాత పర్యావరణ పరిరక్షకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి కన్నుమూశారు.

దిశ,వెబ్‌డెస్క్: ప్రఖ్యాత పర్యావరణ పరిరక్షకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి కన్నుమూశారు. వనజీవి రామయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వనజీవి మృతిపై సంతాపం తెలిపారు. వనజీవి రామయ్య మరణం బాధాకరం అన్నారు. "వృక్షో రక్షతి రక్షితః" అన్న ఆయన జీవన సందేశమే ఆయన జీవిత సారాంశం.
చెట్లను మన వంశపారంపర్యంగా భావించి, వాటిని సంరక్షించడం ద్వారా మన భవిష్యత్తును కాపాడతామని చెప్పిన ఆయన, అసలైన పర్యావరణ యోధుడు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన శ్రమ, త్యాగం వలన ఎన్నో వేల ఎకరాల అడవులు పునరుద్ధరించబడ్డాయి. పద్మశ్రీ అవార్డు ఆయన సేవలకు ఒక గుర్తింపు మాత్రమే.. కానీ ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. మనమందరం ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తేనే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.






