ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

by Malleboina Mahesh |   (  Updated:2024-08-24 14:27:47  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 30 వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 30 వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ సంస్థలు అధికారులు పాల్గోనాలని పవన్ కళ్యాణ్ కోరారు. అలాగే కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా..రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించవచ్చని.. 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చిందని.. తొలివిడతలో రూ.15.4 కోట్లు వచ్చాయని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. కాగా డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు ఈ నెల 30న జరిగే వన మహోత్సవ కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లను చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది.

Next Story