- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vamsi: పోలీసు కస్టడీలో వంశీ.. రెండో రోజు..
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఈ రోజు విచారణ కొనసాగిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (vallabhaneni vamsi) పోలీసులు ఈ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న మొదటి రోజు ఆయనను ఆయనను విచారించగా ఈరోజు మరోసారి ఆయనను కృష్ణలంక పోలీస్‌స్టేషన్(police station) కు తీసుకు వచ్చారు. ఉదయం 10 గంటలకు సబ్‌జైలుకు చేరుకున్న పోలీసులు ఆయనను తొలుత వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయనను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకొచ్చారు. వంశీని విచారించేందుకు పోలీసు అధికారులు స్టేషన్‌కు చేరుకున్నారు. నిన్న ఆయనను దాదాపు రెండున్నర గంటలపాటు విచారించారు. 20కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. దళిత వ్యక్తిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలతో వంశీనీ ఈ నెల 11న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్‌జైలులో రిమాండ్‌ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిలు పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ లోగా ఆయనను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటీషన్వేశారు. ఆ పిటీషన్‌ను కోర్టు అంగీకరించింది. మూడు రోజుల పాటు విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో ఆయన విచారణ కొనసాగుతోంది.






