- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ముగిసిన వైద్య పరీక్షలు.. తిరిగి జైలుకు తరలింపు
అస్వస్థతకు గురైన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీసులు జైలు నుంచి విజయవాడ (Vijayawada) ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

దిశ, వెబ్‌డెస్క్: అస్వస్థతకు గురైన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీసులు జైలు నుంచి విజయవాడ (Vijayawada) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు కావాల్సిన మెడిసిన్స్‌ను అందజేశారు. అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కాలంలో భారీగా బరువు తగ్గారు. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికి రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న వంశీని చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వాసుపత్రికి తరలి వచ్చారు.
కాగా, సత్యవర్థన్ (Satya Vardhan) కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైన విషయం విదితమే. గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






