- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీజీహెచ్‌లో వల్లభనేని వంశీకి చికిత్స.. హెల్త్ బులెటిన్ విడుదల
నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో కంకిపాడు (Kankipadu) పోలీసులు కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో కంకిపాడు (Kankipadu) పోలీసులు కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి (Guntur Government Hospital)కు తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వంశీ చికిత్స పొందుతున్నారు. జీజీహెచ్ న్యూరాలజీ విభాగంలో మెడికల్ టెస్ట్‌లు చేసి వంశీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్, వల్లభనేని వంశీ ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటిన్ కూడా విడుదల చేశారు. వంశీకి ఫిట్స్ ఉన్నాయని.. నిద్రపోయేటప్పుడు శ్వాస ఆగిపోతుందని తెలిపారు. స్లీప్ టెస్ట్ (Sleep Test) చేసి చికిత్స చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, ప్రస్తుతం తమ దగ్గర స్లీప్ టెస్ట్ అందుబాటులో లేకపోవడంతో ఇతర ఆసుపత్రికి రిఫర్ చేశామని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.






