వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ.. రిమాండ్ పొడిగింపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-22 07:19:06  IST  )

సత్యవర్ధన్ (Satyavardhan) కిడ్నాప్ కేసు వ్యవహారంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi)కి మరోసారి నిరాశే ఎదురైంది.

వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ.. రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: సత్యవర్ధన్ (Satyavardhan) కిడ్నాప్ కేసు వ్యవహారంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi)కి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ మేరకు ఆయనకు మరోసారి రిమాండ్‌ (Reman)ను పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం (SC, ST Special Court) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎప్రిల్ 8న విచారణలో భాగంగా న్యాయమూర్తి వంశీకి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే, నేటితో రిమాండ్ ముగుస్తుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ పోలీసుల తరఫు న్యాయవాదది కోర్టులో తమ వాదనలను బలంగా వినిపించారు. దీంతో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు మే 6 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది.

Next Story