వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ.. మరోసారి రిమాండ్‌ పొడిగింపు

by Kema Shiva Kumar |

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్‌ (Vamsi Mohan)కు మళ్లీ నిరాశే ఎదురైంది.

వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ.. మరోసారి రిమాండ్‌ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్‌ (Vamsi Mohan)కు మళ్లీ నిరాశే ఎదురైంది. సత్యవర్థన్ (Satyavardhan) కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇవాళ్టితో రిమాండ్ ముగుస్తుండగా.. ఇవాళ ఉదయం పోలీసులు ఆయనను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు (Vijayawada SC and ST Court)లో ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆయనకు రేపటి వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు మళ్లీ జిల్లా జైలుకు తరలించారు.

కాగా, ఇదే కేసులో వంశీతో పాటు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి రిమాండ్ నేటితో ముగియడంతో ఇవాళ మళ్లీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ రేపటి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేసులో పరారీలో ఉన్న మరికొంత మంది కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరోవైపు గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ‌లోని సీఐడీ కోర్టు (CBI Court) మే 21 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసివ విషయం తెలిసిందే.

Next Story