- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : వల్లభనేని వంశీకి బెయిల్.. రేపు బయటికి!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi)కి భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్ డెస్క్ : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi)కి భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు(Bail Granted) చేసింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు ఆరోపణలతో 2019 అక్టోబర్ 18న హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో వంశీతో సహా 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఈ కేసులో గత మేలో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైళ్లోనే ఉన్నారు, అయితే, తాజాగా నేడు నూజివీడు కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఇప్పటివరకు వంశీపై నమోదైన భూకబ్జా, టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. దీంతో వంశీ రేపు విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు.






