Vallabaneni Vamshi: వల్లభనేని వంశీకి అస్వస్థత

by Ajay Maddhiboyina |

వైసీపీ నేత‌, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. విచార‌ణ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం వంశీ కంకిపాడు పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌గా

Vallabaneni Vamshi: వల్లభనేని వంశీకి అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత‌, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. విచార‌ణ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం వంశీ కంకిపాడు పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌గా అస్వ‌స్థ‌తకు గుర‌వ్వ‌డంతో ఆయ‌న‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇదిలా ఉంటే వంశీ న‌ఖిలీ ఇళ్ల‌ ప‌ట్టాల కేసులో విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. నూజివీడు కోర్టు వంశీని విచారించేందుకు అనుమ‌తి ఇవ్వ‌గా ప్ర‌స్తుతం ఆయ‌న పోలీసు క‌స్ట‌డీలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే శుక్ర‌వారం కంకిపాడు పోలీస్ స్టేష‌న్‌లో వంశీని విచారించారు.

ఆయనను దాదాపు 20 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. 2019లో నఖిలీ ఇల్ల పట్టాలు ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో పాటూ పలు ప్రశ్నలు అడగ్గా ఆయన ఆందోళన చెందినట్టు సమాచారం. మరింత లోతుగా ఆయనను విచారించాల్సి ఉండటంతో రాత్రి పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంగానే కనిపిస్తున్నారు. తీవ్రమైన దగ్గు సమస్యతో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

Next Story