నేడు అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ

by Muthe.Rajitha |

ఏపీ రాజధాని అమరావతిలోని నేడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

నేడు అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతిలోని నేడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో వాజ్‌పేయి 14 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని గురువారం వాజ్‌పేయి జన్మదిన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరించనున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న ‘అటల్–మోదీ సుపరిపాలన యాత్ర’ ముగింపు కార్యక్రమంగా ‘అటల్ స్మృతి వనం’లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంయుక్తంగా ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు పాల్గొననుండగా.. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న తొలి వాజ్‌పేయి విగ్రహంగా నిలవనుంది. వాజ్‌పేయి సుపరిపాలన, దేశాభివృద్ధికి చేసిన విశేష సేవలను స్మరించుకునేందుకు ఈ చొరవ తీసుకున్నట్లు నేతలు తెలిపారు.

Next Story